షాద్ నగర్, వెలుగు: షాద్నగర్పట్టణంలోని ఓ హోటల్కు తరలిస్తున్న కుళ్లిన చికెన్‌ను సోమవారం పట్టుకున్నారు. మహమ్మద్ అలీఫ్ అనే వ్యక్తి మహబూబ్ నగర్ నుంచి ఆటోలో చికెన్ తీసుకొస్తుండగా.. స్థానిక వ్యాపారులు పట్టుకొని మున్సిపల్ అధికారులకు అప్పగించారు.
ఆటోలో ఉన్న మాంసాన్ని పరిశీలించిన అధికారులు.. అనారోగ్యంతో చనిపోయిన, డ్యామేజ్ అయిన కోళ్ల మాంసమని గుర్తించారు. ఆటోను సీజ్‌చేశామని మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. కుళ్లిన మాంసం కొనుగోలు చేస్తున్న హోటళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
