తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన కొండ రాజు ఐఅండ్‌పీఆర్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజు గతంలో గ్రాఫిక్స్ డిజైనర్‌గా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఫ్లెక్సీల డిజైన్లను తయారు చేశాడు. సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతోపాటు తూప్రాన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు.
