కాంక్రీట్ కుప్పలా బీరుట్ .. ఎటు చూసినా శిథిల భవనాలే

కాంక్రీట్ కుప్పలా బీరుట్ .. ఎటు చూసినా శిథిల భవనాలే

బీరుట్: భారీ పేలుడుతో అతలాకుతలమైన లెబనాన్ రాజధాని బీరుట్లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఎటు చూసినా శిథిల భవనాలు, ధ్వంసమైన వాహనాలు, తమ వారి జాడ కోసం వెతుకుతున్న జనాలే కనిపిస్తున్నారు. మరోవైపు పేలుడు జరిగిన పోర్టు ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. అక్కడి మొత్తం నిర్మాణాలన్నీ నేలమట్టమయ్యాయి. ఆ ప్రాంతం నుంచి ఇంకా పొగలు చిమ్ముతుండటంతో మంటలను ఆర్పేందుకు హెలికాఫ్టర్లతో నీళ్లు, రసాయనాలు జల్లుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య వంద దాటింది. మరో 4 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బీరుట్ పోర్టులో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టులో ఒక దగ్గర చిన్నగా రాజుకున్ననిప్పు ఒక్కసారిగా న్యూక్యర్ లి బాంబును తలపించేలా విధ్వంసం సృష్టించింది. పేలుడు ప్రభావానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకూ ప్రకంపనలు కొనసాగాయి. దాని ఫలితంగా వందలాది బిల్డింగ్లు, వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి.ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనేక మంది మరణించగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుంటే ఒక్కొక్కటిగా డెడ్  బాడీలు బయటపడుతున్నాయి. పేలుడు ధాటికి సిటీ రూపురేఖలే మారిపోయాయి. ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి.

అమోనియం నైట్రేటే కారణమా?

2014లో కాంగో నుంచి వచ్చిన ఓ షిప్ నుంచి స్వాధీనం చేసుకున్న 2,700 టన్నుల అమోనియం నైట్రేట్ను పోర్లోని ట్ ఓ వేర్ హౌస్ లో స్టోర్ చేశామని, పేలుడుకు అదే కారణం కావచ్చని ఇంటీరియర్ మినిస్టర్ మహమూద్ పాహ్మీఓ లోకల్టీ వీకి చెప్పినట్టు తెలుస్తోంది. అమోనియం నైట్రేట్తో పాటు అక్కడే ఉన్న ఓ వేర్ హౌస్లో ఉన్న ఫైర్ వర్క్స్ అంటుకోవడం కూడా పేలుడుకు కారణం కావొచ్చని బ్లాస్ట్ వీడియోను బట్టి ఎక్స్పర్స్ ట్అంచనా వేస్తున్నారు. తొలుత ఓ వేర్హౌస్లో మొదలైన మంటలు అక్కడి నుంచి పక్కనే ఉన్న బిల్డింగ్ కు వ్యాపించాయని, ఆ తర్వాతే భారీ పేలుడు సంభవించి నగరం మొత్తం వణికిందని లోకల్ టీవీ చానెల్స్ లో ప్రసారమైన వీడియోల ద్వారా తెలుస్తోంది.

సాయం చేయండి

భారీ పేలుడుతో అతలాకుతలమైన బీరుట్కు అన్ని దేశాలు సాయం చేయాలని లెబనాన్ ప్రధాని హసన్ డియాబ్ కోరారు. తాము నిజమైన విపత్తును ఎదుర్కొంటున్నామన్నారు. పేలుడుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అయితే పేలుడుకు గల స్పష్టమైన కారణాన్ని ఆయన వెల్లడించలేదు.