చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం: కాలి బూడిదైన 30 గుడిసెలు

చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం: కాలి బూడిదైన 30 గుడిసెలు

చందానగర్, వెలుగు: భారీ అగ్ని ప్రమాదం జరిగి భవన నిర్మాణ కూలీలు నివాసం ఉండే 30 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఫైర్​ ఆఫీసర్ ​నాగేశ్వర్​రావు తెలిసిన వివరాల ప్రకారం.. చందానగర్​లోని జవహర్​నగర్​కాలనీలో ఎస్ వీఎస్​యాంపిల్ హోమ్స్​అపార్ట్​మెంట్ ​నిర్మిస్తున్న కార్మికులు దాని పక్కనే గుడిసెలు వేసుకున్నారు. 

సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగి ఆ గుడిసెలకు అంటుకున్నాయి. ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పటాన్​చెరు ఫైర్​స్టేషన్​ సిబ్బంది ఫైర్​ఇంజిన్​తో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డీఎఫ్​వో నాగేశ్వర్​రావు తెలిపారు. కూలీలకు చెందిన సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు పేర్కొన్నారు.