మాస్టర్ జి స్పెషల్ ​సాంగ్​ రిలీజ్ : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

మాస్టర్  జి స్పెషల్ ​సాంగ్​ రిలీజ్ : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి
  • ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి  

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాస్టర్ జి రచించిన ప్రత్యేక గీతాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం హైదరాబాద్​లోని సోమాజిగూడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాస్టర్ జి మంచి పాట రాశారని, అందరూ ఆదరించాలని కోరారు. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు గొప్ప భవిష్యత్​ ఉంటుందని ఆశించామని, కానీ, పదేండ్ల పాలనలో ఒకే ఒక్క కుటుంబ ఆధిపత్య పాలన కొనసాగిందన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ నిర్మాణం మొదలైందన్నారు. మాస్టర్ జి మాట్లాడుతూ... తాను రచించిన పాటను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విడుదల చేయడం  ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. తెలంగాణ రావడానికి విద్యార్థులతో పాటు కాకా వెంకటస్వామి, కొండా లక్ష్మణ్​బాపూజీ, సదాలక్ష్మితోపాటు మరెందరో మహానుభావులు పోరాడారని గుర్తు చేశారు. ఇటువంటి తెలంగాణకు కాపాడుకోవాలంటే కాంగ్రెస్​తో మాత్రమే సాధ్యమవుతుందని, పేదలకు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. అటువంటి పార్టీని కాపాడుకోవాలన్నారు.