భద్రాచలం, వెలుగు : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పకంజూర్జిల్లా బల్బెడ అడవుల్లో ఉన్న మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు సరిహద్దున ఉన్న ఈ అడవుల్లో మావోయిస్టు ఆయుధ ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతాబలగాలు తనిఖీలు ప్రారంభించారు. బల్బెడ అడవుల్లో ఫ్యాక్టరీ కనిపించడంతో దానిని ధ్వంసం చేసి మెషీన్లు, 150 బీజీఎల్ పైపులు, 12 బోర్ తుపాకుల పైపులు, 20 రైఫిల్రాడ్స్ తో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
