'ప్రతీసారి మగావాడే తప్పు చేయడు'.. జయం రవికి మద్దతుగా ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా!

'ప్రతీసారి మగావాడే తప్పు చేయడు'.. జయం రవికి మద్దతుగా ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా!

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల ప్రెస్ మీట్ లో జయం రవి తన వైవాహిక జీవితంపై, తాను పడ్డ నరకంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్, నటి మీరా చోప్రా రవికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ప్రతి సారి మగవాడిదే తప్పుకాదు..

రవి  మోహన్ పరిస్థితిపై మీరా చోప్రా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు జయం రవి చాలా బాగా తెలుసు, అతను ఎంతో సున్నితమైన, మంచి వ్యక్తి. ప్రతిసారీ మగవాడిదే తప్పు కాదు. ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. మగవారి వర్షన్‌ను కూడా ప్రపంచం వినాలి. రవికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

 

నాపై చేతబడి చేశారు.. 

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయం రవి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. నా విడాకులు తేలేంతవరకు నేను సినిమాల్లో నటించను. పెళ్లయిన మొదటి రోజు నుంచే నన్ను తీవ్రంగా అవమానించారు. నాపై చేతబడి చేయడం వల్లే నేను రక్తం కక్కుకున్నాను. మానసిక క్షోభ భరించలేక నా మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. అయినా సరే మరుసటి రోజు కమిట్‌మెంట్‌తో షూటింగ్‌కు వెళ్లాను. ఫెమినిజం పేరుతో నన్ను వాడుకున్నారు. నా పిల్లలను కూడా నన్ను కలవనివ్వకుండా బాడీగార్డ్స్ పెట్టి అడ్డుకుంటున్నారు  అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ బుల్లింగ్ కారణంగానే తన స్నేహితురాలు కేనీషా ఫ్రాన్సిస్ తనకు దూరమైందని, బుల్లింగ్ చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు.

 

తగ్గేదేలే అంటున్న ఆర్తి!

రవి వ్యాఖ్యలపై ఆయన భార్య ఆర్తి రవి ఇన్‌స్టాగ్రామ్‌లో పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చారు. నిద్రిస్తున్న సింహాన్ని ఎప్పుడూ నిద్రలేపకూడదు. నా మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు. నా పిల్లల కోసం, నా గౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతాను, నిజమే గెలుస్తుంది అని పోస్ట్ పెట్టారు. దీనికి సీనియర్ నటి ఖుష్బూ సుందర్ మద్దతు ఇస్తూ.. తల్లితో పెట్టుకోవద్దు, నువ్వు సింహంలా పోరాడు అని కామెంట్ చేశారు.

►ALSO READ | Karuppu Box Office Collection: సూర్య, త్రిషల 'కరుప్పు' కలెక్షన్ల విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

కాగా, రవి ప్రెస్‌మీట్‌లో 'మూడక్షరాల ఇడ్లీ నటి' అంటూ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఖుష్బూ గురించేనని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం, ఇలా బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti (@aarti.ravi)