Karuppu Box Office Collection: సూర్య, త్రిషల 'కరుప్పు' కలెక్షన్ల విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

Karuppu Box Office Collection: సూర్య, త్రిషల 'కరుప్పు' కలెక్షన్ల విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. వైవిధ్యభరితమైన నటనతో మెప్పించే సూర్య, లాంగ్ గ్యాప్ తర్వాత ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో థియేటర్లలోకి వచ్చి ఊచకోత కోస్తున్నారు. మే 15న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకునేసరికి బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ రికార్డులను క్రియేట్ చేసింది.

మూడు రోజుల్లోనే రూ. 147 కోట్లు..

ఈ చిత్రం కేవలం మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 147 కోట్లను వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.  లేటెస్ట్ గా మేకర్స్ దీనిని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సూర్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచింది. ఒక్క తమిళనాడులోనే తొలి మూడు రోజుల్లో దాదాపు రూ. 60 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. వీకెండ్ ముగిసినప్పటికీ, సోమవారం (వీక్ డేస్) కూడా బుకింగ్స్ సాలిడ్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద సూర్య ఫ్యాన్స్  ఆనందానికి అవధులు లేవు..

 

కోర్టు రూమ్ డ్రామా.. 

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కథాంశం ఎంతో ఆసక్తికరంగా ఉంది. అవినీతి, జాప్యంతో కూడిన లీగల్ సిస్టమ్ కారణంగా న్యాయం కోసం పోరాడే ఒక తండ్రి, కూతురు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల నమ్మకమైన విలేజ్ గాడ్ 'కరుప్పుసామి' (తెలుగులో వీరభద్రుడు) దైవ రూపం దాల్చి లాయర్ శరవణన్‌గా కోర్టులోకి అడుగుపెట్టి దుర్మార్గుల భరతం పట్టడమే ఈ సినిమా కథ. సూర్య రస్టిక్ అండ్ డివైన్ లుక్, ఆయన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

►ALSO READ | Peddi Trailer Release: కుస్తీ బరిలో గ్లోబల్ స్టార్ ఊరమాస్ వేట.. రామ్‌చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది!

క్రేజీ కాంబినేషన్..

దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య సరసన త్రిష కృష్ణన్ (ప్రీతి పాత్రలో) నటించడం సినిమాకు భారీ ప్లస్ అయింది. ఆర్జే బాలాజీ లాయర్ 'బేబీ కన్నన్'గా విలన్ పాత్రలో మెప్పించగా.. శరవణన్, శివద, అనఘా మాయా రవి, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి..