ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన లక్ష్యం : ఆర్టీసీ ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బొంతు రామ్మోహన్

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ప్రధాన లక్ష్యం : ఆర్టీసీ ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బొంతు రామ్మోహన్
  •     టీడబ్ల్యూయూ కూటమికి మద్దతివ్వాలి
  •      పీసీసీ ఉపాధ్యక్షుడు, ఆర్టీసీ ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బొంతు రామ్మోహన్

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: ప్రభుత్వంలో  ఆర్టీసీని విలీనం చేయడంతోపాటు కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడమే తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌‌‌‌‌‌‌‌(టీడబ్ల్యూయూ) కూటమి ప్రధాన లక్ష్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు, ఆర్టీసీ ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ ప్రెస్ క్లబ్ లో సంఘం అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఈ.అశ్వత్థామరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు టీడబ్ల్యూయూ కూటమికి ఉందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్ గౌడ్ మద్దతు లేఖ ఇచ్చారని చెప్పారు. 

గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కేటాయించిన బాణం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలతో టీఎంయూ ఎన్నికల బరిలో లేకపోవడంతో టీడబ్ల్యూయూ, ఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సుమారు పదేండ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీజేఈయూ జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర రాజు, ట్రేడ్ యూనియన్ నాయకుడు చల్ల నరసింహారెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు శంకర్  పాల్గొన్నారు.