సికింద్రాబాద్ ‘ఉజ్జయిని’లో శరన్నవరాత్రులపై రివ్యూ మీటింగ్

సికింద్రాబాద్ ‘ఉజ్జయిని’లో శరన్నవరాత్రులపై రివ్యూ మీటింగ్
  • హాజరైన ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో రానున్న దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. 

భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల నిర్వహణ తదితర అంశాలపై శనివారం ఆలయ ప్రాంగణంలో సమీక్ష జరిపారు. ఈ మీటింగ్​కు ఈవో మనోహర్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, ఆలయ చైర్మన్ సురిటి కామేశ్వర్, మండలి సభ్యులు, సిబ్బంది, అర్చకులు హాజరయ్యారు.