మెట్రో ఫేజ్ 1ను విజయవంతంగా పూర్తి చేశామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బేగంపేట మెట్రోరైల్ భవన్ లో ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు 31 కిలోమీటర్లు నిర్మించబోతున్నామని.. దీని కోసం మొత్తం రూ.6250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామని..భూసేకరణ ఇబ్బంది లేదని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. సిటీ మెట్రో ప్రస్తుతం స్పీడ్ మినీమమ్ 35 కిలోమీటర్ ఫర్ అవర్ ఉందని, మాక్సిమమ్ 80 కిలోమీటర్లు ఉందన్నారు. అదే ఎయిర్ పోర్ట్ మెట్రో స్పీడ్ 120 మాక్సిమమ్ ఉంటుదని.. 26 నిమిషాల్లో 31 కిలోమీటర్లు రిచ్ అవుతామన్నారు. ఈ ట్రైన్ లిమిటెడ్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. న్యూయార్క్, లండన్ దేశాల్లో ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ ను ఎయిర్ పోర్ట్ మెట్రోకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు.
ఈ ట్రైన్స్ కు మూడు కోచ్ లు.. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 6 కోచ్ లకు డిజైన్ చేశామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పీక్ అవర్స్ లో ప్రతి 8 నిమిషాలకు.. నాన్ పిక్ అవర్ లో ప్రతీ 20 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తుందని.. ఆ తర్వాత 2.5 నుండి 5 నిమిషాలకు ఒక ట్రైన్ ఆపరేట్ చేస్తామన్నారు. సీబీఐటీసీ టెక్నాలజీతోనే ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ ఉందని తెలిపారు.
రానున్న రోజుల్లో కేవలం ఎయిర్ పోర్ట్ పాసింజర్సే కాకుండా సిటీ అవుట్ స్కార్ట్ లో ఉండే వారు సిటీకి వచ్చేందుకు ఎయిర్ పోర్ట్ మెట్రో సెకండ్ ఫేజ్ ఉంటుందని.. దీనిపై జనరల్ కన్సల్టెంట్ తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 300 కోర్టు కేసులను గెలిచి.. 3000 ఎకరాల భూమి సేకరణ జరిగిందని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఎయిర్ పోర్ట్ మెట్రోను పూర్తి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
