ట్యాంకర్లు లేట్ అయితే యాక్షన్ తప్పదు : మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

ట్యాంకర్లు లేట్ అయితే యాక్షన్ తప్పదు : మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
  • తట్టిఖానా, జూబ్లీహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్లలో తనిఖీలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల సరఫరా జరగాలని, డెలివరీ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను గట్టిగా హెచ్చరించారు. శనివారం తట్టిఖానా, జూబ్లీహిల్స్ లోని ఫిల్లింగ్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ట్యాంకర్ల పంపిణీ, సమయపాలన, వినియోగదారులకు అందుతున్న సేవల తీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రానున్న వారం రోజుల పాటు మూడు షిఫ్టుల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షాలు ప్రారంభమయ్యే వరకు ప్రజలు కూడా నీటిని పొదుపుగా వినియోగించి, వృథాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.