తెలంగాణ భవన్‌‌ను నాటకాలకు అద్దెకివ్వండి : మెట్టు సాయికుమార్ 

తెలంగాణ భవన్‌‌ను నాటకాలకు అద్దెకివ్వండి : మెట్టు సాయికుమార్ 
  • బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భవన్‌‌ను నాటకాలకు అద్దెకివ్వాలని మత్స్య అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మాక్ అసెంబ్లీ పేరుతో కపట నాటకాలు ప్రదర్శించారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్‌‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆ కార్యక్రమం ముందు జబర్దస్త్ కామెడీ షో కూడా దిగదుడుపేనని పేర్కొన్నారు.

.రంగస్థలం నుంచి సినిమాల వరకు ఎంతోమంది గొప్ప కళాకారులను అందించిన సురభి నాటక కంపెనీలను తలపించేలా బీఆర్ఎస్ నేతలు నటించారని ఎగతాళి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌‌రావు, జగదీశ్‌‌రెడ్డి, తలసాని తదితరులకు ‘నవరస సార్వభౌమ’, ‘కళా ప్రపూర్ణ’, ‘కళా తపస్వి’ వంటి బిరుదులు సరిపోతాయని, వచ్చే ఏడాది వారందరికీ ‘గద్దర్ అవార్డులు’ ఇవ్వాల్సిందేనని ఆయన సెటైర్లు వేశారు. పేజీల కొద్దీ డైలాగులు చెబుతూ, కపట ఏడుపులతో ఆ కార్యక్రమాన్ని రక్తికట్టించారని మండిపడ్డారు.