V6 News

మే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు

మే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు

నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని  పీజీ కళాశాలలకు  మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయంలోని  రిజిస్ట్రార్ కార్యాలయం, ఎగ్జామ్ బ్రాంచ్, ప్రిన్సిపాల్, ఇతర కార్యాలయాలు యథావిధిగా తమ విధులను నిర్వర్తిస్తాయని ఆయన తెలిపారు. జూన్ 1 నుంచి మళ్లీ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.