నకిరేకల్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కట్టంగూర్, నకిరేకల్, కేతపల్లి మండలాల రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో వేముల వీరేశం ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ధాన్యం తూకం, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

