V6 News

సెలవు రోజుల్లోనే స్కూళ్లలో రిపేర్లు పూర్తి చేయాలి.. రిపేర్ల అంచనాలు రూపొందించాలి

సెలవు రోజుల్లోనే స్కూళ్లలో రిపేర్లు పూర్తి చేయాలి.. రిపేర్ల అంచనాలు రూపొందించాలి

యాదాద్రి, వెలుగు : సెలవు రోజుల్లోనూ స్కూళ్లు, హాస్టళ్లలో అవసరమైన రిపేర్లను పూర్తి చేయాలని యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు. ఏఏ రిపేర్లు అవసరమో గుర్తించి అంచనాలు రూపొందించాలని సూచించారు. బుధవారం జిల్లాలోని రామన్నపేట హాస్టల్, జనంపల్లి రెసిడెన్షియల్​ స్కూల్​ను ఆయన సందర్శించారు.  

రూమ్స్​, బాత్​రూముల రిపేర్లను గుర్తించాలని సూచించారు. జనంపల్లి ప్రిన్స్​పాల్​ ఇంటిమేషన్​ లేకుండా గైర్హాజరు కావడంతో సీరియస్​ అయ్యారు. అనంతరం ఎడ్యుకేషన్​​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి స్కూల్స్​లో స్టూడెంట్స్​ అడ్మిషన్​ పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై రివ్యూ నివహించారు. వడ్ల కొనుగోలు స్పీడప్ ​చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆయన ఆదేశించారు.