- కడియం కావ్య, రామసహాయం ప్రశ్నలకు గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు సహకరిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీలు కడియం కావ్య, రామసహాయం రఘురామ్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని కాకతీయ వారసత్వ చిహ్నాలతో సహా 9 కేంద్ర సంరక్షిత కట్టడాల సంరక్షణ పనులను క్రమం తప్పకుండా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రసాద్ స్కీం కింద ములుగు జిల్లా రామప్ప ఆలయ అభివృద్ధికి రూ.61.99 కోట్లు మంజూరు చేశామన్నారు.
హైదరాబాద్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్కిల్ పరిధిలోని రామప్ప, వేయిస్తంభాల గుడి, వరంగల్ కోటల సంరక్షణకు 2023–24లో రూ.2.40 కోట్లు, 2024–25లో రూ.2.05 కోట్లు, 2025–26లో రూ.4.11 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
