ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తరు:గోపాల్ రాయ్

ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తరు:గోపాల్ రాయ్

మనీలాండరింగ్ ఆరోపణలతో  ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు సేవలపై ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. తీహార్ జైలులో జైన్ మసాజ్ కి సంబంధించి 10 రోజులుగా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేశాం, ఇకపై చేస్తాం అన్నదే బీజేపీ నినాదంగా కనిపిస్తోందన్నారు. పని చేశాం, ఇంకా పని చేస్తాం అన్నదే కేజ్రీవాల్ నినాదమన్నారు. 

తిట్లు (ఆరోపణలు) తిట్టేవారికి ఓటేయాలా లేక పనిచేసేవారికి ఓటేయాలా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని  మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అమిత్ షా జైల్లో ఉన్నప్పుడు గుజరాత్ జైల్లో ఏకంగా ప్రత్యేక గదినే నిర్మించారని..అంతటి స్పెషల్ ట్రీట్మెంట్ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఇప్పుడు డిసెంబర్ 4న ఢిల్లీ ప్రజలు బీజేపీకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పారు. 

సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియో థెరపిస్ట్ కాదని.. రేప్ కేసులో నిందితుడన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ తీసుకుంటున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటల్లో నిజం లేదని తేలిపోయింది. త్యేందర్ జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి తీహార్ జైలులో పోక్సో చట్టం కింద శిక్ష అనుభవిస్తున్న రింకూ అనే ఖైదీ అని జైలు అధికారులు గుర్తించారు. అతను పోక్సోతో పాటు ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల కింద అభియోగాలు ఎదుర్కొంటున్న చెప్పారు. జైలు అధికారుల ప్రకటనతో మంత్రి సత్యేందర్ సహచర ఖైదీలతో మసాజ్ చేయించుకున్నారన్న విషయం వెల్లడైంది. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం ఈ విషాన్ని బహిరంగంగా చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.