కృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి అప్పగించింది కేసీఆరే: మంత్రి జూపల్లి

కృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి అప్పగించింది కేసీఆరే: మంత్రి జూపల్లి

పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( మే 19 ) జరిగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి తరలించింది బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు. 

పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ చెబుతోందని... రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు

కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు ఒప్పుకుంది బీఆర్ఎస్ సర్కారేనని..కృష్ణాలో 512 టీఎంసీలు కావాలని కాంగ్రెస్ కొట్లాడుతోందని అన్నారు జూపల్లి. రేవంత్ నాయకత్వంలో పాలమూరు వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. కృష్ణానదిలో 62 శాతం నీటి కేటాయింపులు కావాలని కోరుతున్నామని అన్నారు మంత్రి జూపల్లి.