అల్మాస్ పూర్ ఘటన బాధాకరం

అల్మాస్ పూర్ ఘటన బాధాకరం

ఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‎లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను చూసి.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు కేటీఆర్ సూచించారు.