తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. అవును మిస్టర్ పవన్.. తెలంగాణ మా జాగీరే 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగీరే అని సమాధానం చెప్పారు. ఏపీలో ఏం పీకావు.. తెలంగాణలో ఏం పీకుతావు..? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తోందని అన్నారు. తెలంగాణకు మద్ధతుగా ఎప్పుడైనా పవన్ మాట్లాడారా..? అమరవీరుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు మంత్రి. తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకు..ఏపీలో ఏం పీకావు.. ఇక్కడ ఏం పీకుతావు..? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పవన్ ను ఎంగేజ్ చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికితే ఊరుకోమని హెచ్చరించారు. అనవసరంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు.
