ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణంగా ఇండియానే అని జపాన్ ఆరోపణ చేసింది. ఇండియాకు చెందిన ఒక మంత్రి, అధికారుల నిర్లక్ష్యమే ఆలస్యానికి కారణం అంటూ విమర్శించారు.
జపాన్ న్యాయ శాఖ మంత్రి హిదెకీ మకిహరా ఈ ప్రాజెక్ట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విషయంలో మంత్రులు ,అధికారుల తీరు చాలా నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు.
ఇండియా హై స్పీడ్ రైల్ కారిడార్ లేట్ కావడానికి కారణం మీరే.. ఇంత నిర్లక్ష్యపూరితంగా ఉంటే ఎలా ముందుకు సాగుతుందని అన్నారు.
ఇండియా మొట్టమొదటి హై-స్పీడ్ రైలు కారిడార్ అయిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు (MAHSR) సేవలు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా.. 2027 ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాతదశలవారీగా ప్రయాణీకుల సేవలు ప్రారంభం అవుతాయి.
ముంబై-అహ్మదాబాద్ కారిడార్ జపనీస్ షింకన్సెన్ సాంకేతికతను ఉపయోగించి రూపొందిస్తున్నారు. దీనికి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) కొంత మేరకు నిధులు సమకూరుస్తోంది.
జపాన్‌కు చెందిన సీనియర్ రైల్వే ఇంజనీర్, ఢిల్లీకి చెందిన మెట్రో వాహన కన్సల్టెంట్ అయిన ఇసావో సుజిమురా ఒక వ్యాసం రాశారు. జూలై 15న టోక్యోకు ఒక బిజినెస్ న్యూస్ పోర్టల్‌లో రాసిన ఒక వ్యాసానికి రిప్లై గా మకిహారా ఆన్ ఎక్స్ కామెంట్స్ ను చేశారు.
