ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాప్ లో వేయాలి

ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాప్ లో వేయాలి

తనకు బ్రేకులు వేయడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తన స్పీడ్ కు బ్రేకులు వేస్తానని కాంగ్రెస్ నేత రేణుక చౌదరీ అన్న మాటలను మంత్రి తప్పుబట్టారు.  ఎలక్షన్ల సమయంలో వచ్చి వసూళ్లు చేసుకోవడమే రేణుక చౌదరీ చేసే పని అని ఆరోపించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు  పువ్వాడ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మోటర్ వెహికల్ చట్టంలో 15 ఏళ్లు పూర్తైన వాహనాలను స్క్రాప్ లో వేసినట్లుగా రాజీకాయాల్లో సుధీర్ఘకాలంగా ఉంటూ ప్రజలకు పనికిరాని నాయకులను స్క్రాప్ లో వేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలన్నారు. గిరిజనుల వద్ద రేణుక డబ్బులు తీసుకుని భర్త లేని మహిళను వేధిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తల కోసం

కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్

వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి