ఇవాళ్టి(ఆగస్టు5)నుంచి.. MBBS, BDS అడ్మిషన్లకు ఆన్ లైన్ దరఖాస్తులు

ఇవాళ్టి(ఆగస్టు5)నుంచి.. MBBS, BDS అడ్మిషన్లకు ఆన్ లైన్ దరఖాస్తులు
  • నేటి నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌‌‌‌లైన్ దరఖాస్తులు
  • జనరల్​కు 213, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 177 కటాఫ్ మార్కులు
  • ఓసీ, బీసీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.4,000.. ఎస్సీ, ఎస్టీలకు రూ.3,200
  • కోర్సు మధ్యలో వదిలేస్తే రూ.20 లక్షల జరిమానా.. మూడేళ్లు డిబార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్​యూహెచ్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యుజీ-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి(ఆగస్టు5) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఆన్‌‌‌‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌‌‌‌లైన్ దరఖాస్తులు చెల్లవని వర్సిటీ స్పష్టం చేసింది. 

నీట్ కటాఫ్ మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్‌‌‌‌కు 213 (50వ పర్సంటైల్), ఓసీ దివ్యాంగులకు 194 (45వ పర్సంటైల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ వారి దివ్యాంగులకు 177 (40వ పర్సంటైల్) మార్కులుగా నిర్ణయించారు. ఇంటర్ సైన్స్ సబ్జెక్టులలో ఓసీలు కనీసం 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం, దివ్యాంగులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి.

ఆన్​లైన్​లో మొబైల్స్ , ట్యాబ్‌‌‌‌లు వాడవద్దు

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ దరఖాస్తును కేవలం డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్ కంప్యూటర్, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్ ద్వారానే పూర్తి చేయాలని, మొబైల్స్, ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వాడవద్దని వర్సిటీ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ అన్ని విడతలకు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోడ్ ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపింది. రాష్ట్ర రెవెన్యూ అధికారులు జారీ చేసిన బీసీ (బీసీ- ఏ/బీ/సీ/డీ/ఈ) క్యాస్ట్​సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుతాయని, కేంద్ర ప్రభుత్వ ఓబీసీ సర్టిఫికేట్లను ఆమోదించరని, ఎస్సీల సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పనిసరిగా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-గ్రూప్ వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. 

రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.4,000, ఎస్సీ, ఎస్టీలు రూ.3,200 ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెల్లించాలని, సీటు పొంది అల్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకునే సమయంలో రూ.12,000 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని పేర్కొంది. ప్రవేశం పొందిన తర్వాత లేదా రెండో విడత కౌన్సెలింగ్ ప్రకటించిన తర్వాత కోర్సును మధ్యలో నిలిపివేస్తే రూ.20 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు మూడేళ్ల పాటు ప్రవేశాల నుంచి డిబార్ చేస్తారని, నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. 

రిజర్వేషన్ ఇలా.. 

సీట్ల కేటాయింపులో ఎస్సీలకు 15 శాతం (గ్రూప్-1: 1%, గ్రూప్-2: 9%, గ్రూప్-3: 5%), ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ-ఏ: 7%, బీసీ-బీ: 10%, బీసీ-సీ: 1%, బీసీ-డీ: 7%, బీసీ-ఈ: 4%) రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రతి కేటగిరీలో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్, ప్రత్యేక కోటాల కింద  సీఏపీకి 1 శాతం, పీడబ్ల్యూడీకి 5 శాతం, పీఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి 0.25 శాతం సీట్లు కేటాయించారు. 

సింగరేణి సంస్థ ఉద్యోగుల పిల్లలకు రామగుండం మెడికల్ కాలేజీలో 7 సీట్లు, ఆంగ్లో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లకు హైదరాబాద్ జీడీసీలో 1 బీడీఎస్ సీటు రిజర్వ్ చేయగా, 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యుఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎన్సీసీ కేడెట్లకు 3 నుంచి 7 శాతం గ్రేస్ మార్కులు కలపనున్నారు. సందేహాలు, సాంకేతిక సమస్యల నివారణకు పనివేళల్లో 79010 98840, 93926 85856 నంబర్లలో లేదా tsmedadm.tech@gmail.com, knrugadmission@gmail.com ఇమెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లలో సంప్రదించవచ్చని వర్సిటీ తెలిపింది.