హిల్ట్ పాలసీపై తప్పుడు ప్రచారం : మంత్రి శ్రీధర్ బాబు

హిల్ట్ పాలసీపై తప్పుడు ప్రచారం : మంత్రి శ్రీధర్ బాబు
  •     ప్రభుత్వ భూమిపై హక్కును ఎవరికీ బదిలీ చేయడం లేదు
  •     బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హిల్ట్ పాలసీ విష యంలో బీఆర్ఎస్, బీజేపీ ఏకమై రాష్ట్ర ప్రభు త్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మండిపడ్డారు. నాలుక ఉందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ప్రతిపక్షాలను డి మాండ్ చేశారు.

  సోమవారం సాయంత్రం  గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. హిల్ట్ పాలసీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేయవచ్చని చెప్పారు. 

ఈ పాలసీపై తమ ప్రభుత్వ విధానాలు  అత్యంత పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై నియమించిన సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావుతోపాటు తాను కూడా ఉన్నానని శ్రీధర్ బాబు చెప్పారు. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఎవరికీ బదిలీ చేసే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్నవారికి మాత్రమే బదిలీ ( కన్వర్షన్ ) ఫీజు పెట్టామని చెప్పారు. 

హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు, ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ లోపల ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన గాలి, తాగునీటిని అందించడంతోపాటు ఖాయిలాపడ్డ పరిశ్రమల భూములను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని  స్పష్టం చేశారు. కాలుష్యంతో  ఢిల్లీ  ప్రమాదకరంగా మారిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రాకూడదనే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కూ అదే పరిస్థితి రావాలనుకుంటున్నారా?

ఢిల్లీ నగరానికి వచ్చిన తీవ్ర పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ స మస్య.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కూ రావాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ నేతలు కోరుకుంటున్నారా? అని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు ప్రశ్నించారు. వారి తీరు చూస్తే అలాగే ఉన్నదని అన్నారు.  మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటున్నారని, కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తామంటే వ్యతిరేకిస్తున్నారని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు మండిపడ్డారు.  ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం  చేసేలా జీవో ఇచ్చిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. 

సిరీస్ అనే ఫార్మా  కంపెనీకి ఏకంగా వంద ఎకరాల భూమిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, అప్పుడు వారికి నిబంధనలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమల భూముల బదిలీపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతున్నదని మంత్రి వెల్లడించారు. వారు ఎలాంటి పాలసీ లేకుండా పెద్ద ఎత్తున భూముల బదిలీ చేశారని, దీనివల్ల వారి అనుచరులకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపించారు.