ఏసీఎఫ్ వెబ్ సైట్ ఆవిష్కరణ

ఏసీఎఫ్ వెబ్ సైట్ ఆవిష్కరణ

ఈ రోజు (20/07/2022) "అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఏసీఎఫ్)" వెబ్ సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా "ఏసీఎఫ్" వ్యవస్థాపక అధ్యక్షులు రాజపాలెం శ్రీనివాసులు మాట్లాడుతూ మంత్రి తలసాని చేతుల మీదుగా వెబ్ సైట్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.