V6 News

ఎక్కువ ఆయకట్టుకు .. నీళ్లిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టండి: ఉత్తమ్​

ఎక్కువ ఆయకట్టుకు .. నీళ్లిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టండి: ఉత్తమ్​

హైదరాబాద్​, వెలుగు : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై ఫోకస్  పెట్టాలని అధికారులను ఇరిగేషన్​ మినిస్టర్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జలసౌధలో జరిగిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుల పనులల్లో  ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వాటన్నింటిని  తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. భీమా, నెట్టెంపాడు, ఎస్​ఎల్​బీసీ, దేవాదుల, పాలమూరు- రంగారెడ్డి, నారాయణపేట- కొడంగల్​, చిన్న కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్​ ఫో కెనాల్​, మొడికుంటవాడు, చనాకా కొరాటా, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్య జాబితాలో తీసుకొని పనులు పూర్తి చేయాని స్పష్టం చేశారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్​ జీవన్​ పాటిల్​, ఈఎన్​సీ (జనరల్​) అనిల్​ కుమార్​, సంయుక్త కార్యదర్శి భీం ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.