హైదరాబాద్: బాల్క సుమన్ అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. క్యాతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. ఒక ఎంపీ, మంత్రి వెహికల్స్‌పై రాళ్ళతో దాడి చేస్తారా..? మంత్రి కాన్వాయ్ పై దాడి చేసిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని హరీష్ రావును నిలదీశారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావు కూడా క్యాతనపల్లి వచ్చి ప్రచారం చేశారని.. కానీ మేం ఎవరినీ అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ కోదండరామ్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో అసలు గొడవనే లేదని.. బాల్క సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఓటు వేసేందు వెళ్తుంటే సుమన్ మా వెహికల్‌పై రాళ్ళు రువ్వారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదు.. మామీద అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మీద రాళ్ళు ఎందుకు విసిరారో చెప్పాలని బీఆర్ఎస్ వాళ్లు చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ఎన్నికల టైమ్‌లో పోలీసులతో బాల్క సుమన్ మా మీద రైడ్ చేయించాడని.. కానీ మేం అలాంటి పనులు చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం జరిగింది కానీ ఈ సారి ఎలాంటి అక్రమాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగిందో బీఆర్ఎస్ వాళ్లు చెప్పాలన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఓడిపోయాక ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారని విమర్శించారు.
