సంగారెడ్డి జిల్లా బానూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( మే 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. బానుర్ ప్రాంతంతో కాకా వెంకటస్వామి సమయం నుండి మంచి సంబంధాలు ఉన్నాయని.. విశాఖ పరిశ్రమ సమయంలో కూడా ఈ ప్రాంతానికి రోడ్డు వేశామని అన్నారు.
ఇందిరమ్మ ఈ ప్రాంతానికి పలు పరిశ్రమలు తెచ్చారని..తమ ఫ్యాక్టరీ కూడా ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఇందిరా గాంధీ అని అన్నారు. ఈ ప్రాంతంలో ఇందిరా గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉందని.. త్వరలోనే విగ్రహం పెడదామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టే సమయంలో అధికారులు సహాయకారంగా ఉండాలని.. మళ్ళీ ఇంకొన్ని ఇండ్లు రెండో విడతలో ఇస్తామని అన్నారు మంత్రి వివేక్.
అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని... సొంతింటి కల నెరవేర్చుతామని అన్నారు మంత్రి వివేక్. అందరికి రేషన్ కార్డు ఇచ్చాం.. కొత్త పెన్షన్ లు కూడా ఇస్తామని.. నిజంగా అర్హత ఉన్న వారికి పెన్షన్ ఇస్తామని అన్నారు మంత్రి వివేక్.
