హైదరాబాద్ రహమత్ నగర్ లో మంత్రి వివేక్ పర్యటన... కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన..

హైదరాబాద్ రహమత్ నగర్ లో మంత్రి వివేక్ పర్యటన... కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన..

మంగళవారం ( సెప్టెంబర్ 30 ) హైదరాబాద్ రహమత్ నగర్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రహమత్ నగర్ డివిజన్ లో పర్యటించిన మంత్రి పార్టీ శ్రేణులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రహమత్ నగర్ డివిజన్ లోని ఇందిరాగాంధీ నగర్ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. రూ. కోటి 53 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, అజారుద్దీన్, సీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ ఫేజ్ 2 లో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రూ. కోటి 30 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

రహమత్ నగర్ డివిజన్ ప్రతిభా నగర్ లో రూ. 99 లక్షల 50 వేలతో నిర్మించనున్న క్మయునిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. బ్రహ్మశంకర్ నగర్ లో కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. రూ. కోటి 28 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.