గూగుల్‎ను గుడ్డిగా నమ్మితే తిప్పలే.. అన్ని కస్టమర్ కేర్ నెంబర్లే అని బోల్తా పడొద్దు..!

గూగుల్‎ను గుడ్డిగా నమ్మితే తిప్పలే.. అన్ని కస్టమర్ కేర్ నెంబర్లే అని బోల్తా పడొద్దు..!

గూగుల్.. ఇదో డిజిటల్ ప్రపంచం. ఇది అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న సమాచారం కావాలన్న క్షణం ఆలోచించకుండా వెంటనే గూగుల్‎ను ఆశ్రయిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో గూగుల్ ద్వారా నిమిషాల వ్యవధిలో ఇట్టే తెలుసుకుంటున్నాం. అయితే, గూగుల్‎ను మరీ గుడ్డిగా నమ్మితే కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవంటున్నారు తెలంగాణ పోలీసులు. 

గూగుల్‏ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ముఖ్యంగా ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్‎లో సెర్చ్ చేసేటప్పుడు మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 

►ALSO READ | SIR ఫామ్ నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారా..? అలా చేస్తే ఆధార్, మీసేవ సెంటర్లు మూత పడ్డట్లే

గూగుల్‎లో ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే మీకు కనిపించే నెంబర్, వెబ్ సైట్ నకిలీది కూడా కావొచ్చంటున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, యాప్స్, వెబ్ సైట్స్, లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని హెచ్చరిస్తున్నారు. గూగుల్‎లో అధికారిక యాప్స్, వైబ్ సైట్లు మాత్రమే వాడాలని సూచించారు పోలీసులు.