నుమాయిష్ తో వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలో పలు పాఠశాలలు, విద్యా సంస్థలు నడపడం గొప్ప విషయమని మంత్రి తలసాని తెలిపారు. నాంపల్లి నుమాయిష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్.బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ ల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని.. స్వాతంత్య్రం రాకముందు నుండే ఈ నుమాయిష్ నడుపుతున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నో లక్షల మందిని చదివించి ఉన్నత శిఖరాలకు అందించిన ఘనత ఈ ఎగ్జిబిషన్ సొసైటీదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపారనే విషయాన్ని చెప్పారు. మంత్రి హరీష్ అధ్యక్షుడుగా సొసైటీకి ఉండడం అదృష్టమని, మంచి కోసం ఈ ఎగ్జిబిషన్ ను నడుపుతున్నారన్నారు.
‘నా చిన్నతనం నుండి ఈ ఎగ్జిబిషన్ కార్యాకలాపాలు చూస్తున్నానని ఆర్.బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చదువు కోసం ఈ సొసైటీ ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నారని, 10 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సొసైటీ. నా వంతుగా ఎగ్జిబిషన్ కు సహాయసహకారాలు అందిస్తానన్నారు. ఎగ్జిబిషన్ తో వచ్చిన డబ్బులను ఎడ్యుకేషన్ కు ఖర్చు చేస్తానని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.

