చౌటుప్పల్ వెలుగు : మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని వారికి డీజిల్ ఖర్చు తప్పా ఒక్క సీటు గెలిచేది లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యేది లేదు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గెలిచేది లేదన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు గౌడ్, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వెన్ రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.
