వెయ్యి రోజుల పాలనలో వేగంగా అభివృద్ధి.. రూ.900 కోట్ల పనులు జరుగుతున్నయ్

వెయ్యి రోజుల పాలనలో వేగంగా అభివృద్ధి.. రూ.900 కోట్ల పనులు జరుగుతున్నయ్
  •     రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​
  •     1500 మందితో భారీ ర్యాలీ

గోదావరిఖని, వెలుగు: వెయ్యి రోజుల ప్రజాపాలనలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ​ఠాకూర్​ అన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం గోదావరిఖనిలో 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెయ్యి రోజుల పాలనలో నియోజకవర్గంలో సుమారు రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.

ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో అదనపు భవనాలు, ఇందిరమ్మ ఇండ్లు, నర్సింగ్​కాలేజీ, కొత్త రోడ్లు,  రోడ్ల విస్తరణ, అండర్ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రామగుండాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని, రామగుండం వీధుల్లోకి వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూస్తే వాస్తవం ఏంటో అర్థమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, లీడర్లు బొంతల రాజేశ్, కాల్వ లింగస్వామి, ఎం.రవికుమార్, దీటి బాలరాజు, కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, ఎన్.రాము, టి.యుగేందర్, ఎంఏ ఫజల్, డి.సతీశ్, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.