పొటెన్సీ టెస్ట్‌‌.. ట్రైనీ ఐపీఎస్‌‌ పిటిషన్‌‌పై తీర్పు రిజర్వ్

పొటెన్సీ టెస్ట్‌‌.. ట్రైనీ ఐపీఎస్‌‌ పిటిషన్‌‌పై తీర్పు రిజర్వ్

హైదరాబాద్, వెలుగు: అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సస్పెండైన ట్రైనీ ఐపీఎస్‌‌ ఆఫీసర్ ఉదయ్‌‌ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దర్యాప్తులో భాగంగా పొటెన్సీ పరీక్ష నిర్వహించేందుకు కింది కోర్టు ఇచ్చిన అనుమతిని సవాల్‌‌ చేసిన పిటిషన్‌‌పై వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత ప్రకటిస్తామని జస్టిస్‌‌ జె. శ్రీనివాసరావు  ప్రకటించారు. మరో ట్రైనీ ఐపీఎస్‌‌ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై అత్యాచార కేసు నమోదైంది.