అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  స్పందించారు. ఈ నిబంధనలు కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే వర్తిస్తాయా? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఎథిక్స్ కమిటీ నిబంధనలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వర్తించవా? కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికే వర్తిస్తాయా?" అంటూ ఆయన నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని స్పష్టం చేశారు.

ఈ నెల 29వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరగనున్న ఎథిక్స్ కమిటీ భేటీకి తాను కచ్చితంగా హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. తన వాదన ఏంటో, తన సమాధానం ఏంటో అక్కడే స్పష్టంగా చెబుతానని ఆయన తేల్చిచెప్పారు.

గత అసెంబ్లీ సెషన్స్ లో సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు రావడంతో  కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 29న ఎథిక్స్ కమిటీ భేటీ కానుంది.