జగిత్యాల ఛైర్ పర్సన్ భోగ శ్రావణి వాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రావణి చేసిన ఆరోపణలు బాధ కలిగించాయని అన్నారు. తాము తండ్రీకూతుళ్లలా ఉండేవాళ్లమని, మంచి ఫ్యూచర్ ఉందని ఆమెకు ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఛైర్మన్పై కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నావారికి సర్ధి చెప్పామని, ఇటీవల కొందరు కౌన్సిలర్లు ఆవిశ్వాసం అంశం తీసుకువచ్చినా తోసిపుచ్చానని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లానని గుర్తు చేశారు. బుధవారం ఉదయం కౌన్సిలర్ల సమన్వయ సమావేశానికి రావాలని స్వయంగా శ్రావణికి ఫోన్ చేసి చెప్పినా ఆమె హజరు కాలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు.
