వారఫలాలు ( 2026 మే 3– 9 ) : ఈ వారం గ్రహ స్థానాల ప్రకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బుధుడు ... సూర్యుడు మేషరాశిలో కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఇంకా శుక్రుడు విపరీత రాజయోగాలను ఏర్పరుస్తాడు. శని మీనరాశిలో.... కుజుడు మీనరాశిలో... రాహువు కుంభరాశిలో... కేతువు సింహరాశిలో.. గురుడు మిథునరాశిలో ఉంటారు. ఈ వారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని పనుల కోసం అటూ... ఇటూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని పనులు కష్టపడి చేసినా ఉపయోగం ఉండదు. కాని ఎలాంటి ఇబ్బంది. అలాంటి పనులు కాకపోవడమే మంచిదని ఆలస్యంగా గ్రహిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. తోటి ఉద్యోగుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి : ఈ వారం ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పని విషయంలో కష్టపడాల్సి ఉంటుంది. చివరకు అనుకున్న పనులు సాధిస్తారు. వారం మధ్యలో కొంచెం హడావిడిగా గడుపుతారు. కొన్ని గృహ సమస్యలు తీవ్రమైన ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఇతరులతో ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే అవకాశం ఉంది. ప్రతి పనిని ఆలోచించి నిదానంగా చేయండి. ఎలాంటి ఆందోళన చెందకండి. వారం చివరిలో అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి సంబంధ విషయాలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి.. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనికి ప్రశంసలు పొందుతారు. మీ రంగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో అత్యంత కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు
కర్కాటక రాశి: ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని ధైర్యంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు ప్రమోహషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్లు చేపడతారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది . కొన్ని వ్యక్తిగత సమస్యలు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. అనవసర ఖర్చుల్ని చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కన్యారాశి : ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆలస్యం కలిగినా మొత్తం మీద పూర్తి చేస్తారు. ఇతరులకు ఎట్టి పరిస్థితిలో అప్పు ఇవ్వవద్దు. కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాయింట్ వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాతో కూడిన భాద్యతలు వరిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ లు అందుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
తులారాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు..
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈ వారం కొంచెం హడావిడిగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆవేశంతో.. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. అనవసరమైన ఖర్చులు ఆర్థిక పరిస్థిపై కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి. వారం మధ్యలో చిన్న పనులకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను నియంత్రించుకోవాలని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని సునాయాశంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు .. కార్యాలయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. పనిలో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వలన మీ లక్ష్యాలను సకాలంలో సాధింస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతుతన్నారు.పెళ్లి కోసం ఎదురు చూస్తున్నవారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో సహోద్యోగుల నుండి ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. ప్రభుత్వ సంబంధిత విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల మధ్య అభిప్రాయబేధాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండండి.
కుంభ రాశి:ఈ వారం ఈ రాశివారికి అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనుల్లో ఈ వారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందేందుకు రూట్ క్లియర్ అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగాసాగిపోతాయి.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.కొంతమంది మీ పనికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు. పెద్దల సూచనలను పాటించండి. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
