సమ్మర్ సీజన్.. బెస్ట్ ఫుడ్.. రోజు పొద్దున్నే ఈ బువ్వ తినండి.. అలసటే ఉండదు..! 

సమ్మర్ సీజన్.. బెస్ట్ ఫుడ్.. రోజు పొద్దున్నే ఈ బువ్వ తినండి.. అలసటే ఉండదు..! 

ఎండాకాలంలో ఎండలు సుర్రుమంటున్నాయి.  వాతావరణం ఎట్లున్నా సరే కొలువుకు పోవాల్సిందే.. మరి సమ్మర్​ సీజన్​ లో కొద్దిసేపు పనిచేస్తే అలసట వస్తుంది.  అందుకే పూర్వం చాలా మంది చద్దిబువ్వ తెచ్చుకొనేటోళ్లు.. కాని ఇప్పుడు అలా ఎవరూ తెచ్చుకోవడం లేదు కాని  కర్డ్​ రైస్​.. లెమన్​ రైస్​ దానికే కొత్త పేర్లు పెట్టి తెచ్చుకుంటున్నారు.  మరి సమ్మర్​ సీజన్​ లో షుగర్​ ఉన్నవాళ్లకు ఈ రెంటిలో ఏది బెస్ట్​.. ఏది శరీరానికి అలసట లేకుండా చేస్తుందో తెలుసుకుందాం..!

అన్నం తినకుండా జనాలు బతకాలంటే చాలా కష్టం.. దేవుడి పేరు మీద ఉపవాసం ఉన్నా.. పొట్టలో ఏదో ఒకటి వేసి నింపుతారు.  ఇక ఎండా కాలం వస్తే చాలు కూల్​గా ఉండేందుకు చలువచేసే ఆహారాన్ని తీసుకుంటారు.  చాలామంది నీళ్లతో కడుపు నింపుకుంటారు.  అయినా సరే చలువచేసే అన్నం తినాల్సిందే.. మరీ ముఖ్యంగా పెరుగన్నం.. లేదా నోటికి రుచినిచ్చే లెమన్​ రైస్​ తింటారు.  ఇవి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. .  .!

ప్రస్తుతం జనాలు ఎక్కువమంది మధుమేహం ( డయాబెటిస్​ @షుగర్​ వ్యాధితో బాధపడుతున్నారు.  ఇలాంటి వారికి బియ్యంతో తయారు చేసిన పదార్దం తింటే వెంటనే షుగర్ లెవల్స్​ పెరుగుతాయి.  కాని ఫుడ్స్ జర్నల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  తెలిసిన వివరాల ప్రకారం..

తెల్లబియ్యంలో  గ్లైసెమిక్​ ఇండెక్స్​ 58 శాతం ఉంటుంది.  అయితే అన్నంలో .. ఎక్కువ ఆయిల్​ తో తయారు చేసిన పదార్దాలను.. కారం.. ఉప్పు అధికంగా ఉన్న వాటిని.. మసాలాలు కలిసిన వాటిని.. నిల్వ పచ్చళ్లను  కలుపుకొని తింటే చాలా ప్రమాదం.  అలా కాకుండా.  తెల్ల బియ్యంతో తయారు చేసిన అన్నంలో  ప్రోటీన్, కొవ్వు లేదా ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు  గ్లూకోజ్​ లెవల్స్​ తగ్గుతాయి. 

ఇక పెరుగన్నం బ్లడ్​ షుగర్​ లెవల్స్​ను కంట్రోల్​ చేసి.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.  పెరుగులోని మంచి బ్యాక్టీరియా కార్బోహైడ్రేడ్ల పనితీరును నెమ్మదిస్తుంది.  అంతే కాదు కర్డ్​లో ఉండే ప్రోటీన్​ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.  ఇది జీర్ణవ్యవస్థను చల్లబరచడమే కాకుండా బాడీకి కావలసిన శక్తిని అందిస్తుంది. 

లెమన్​ రైస్​ లో ఉండే ఆమ్ల గుణంలో ఉండే కార్భోహైడ్రేట్లు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది, సాధారణంలో లెమన్​రైస్​ లో తాలింపు వేస్తాం.. ఇందులో వాడే అతి తక్కువ నూనె, పల్లీలు, ఆవాలు, మెంతులు, ఇంకా ఇతర పోపు గింజలు శరీరానికి ప్రోటీన్లను అందిస్తాయి.  లెమన్ రైస్​ లో నిమ్మరసం వాడకం వలన  గ్లూకోజ్​ స్థాయిలు కంట్రోల్​ లో ఉంటాయి. 

అయితే మీరు ఏది తిన్నా ఎంత తింటున్నారు అనే విషయాన్ని కచ్చితంగా పరిశీలించుకోవాలి.  ఒక కప్పు అన్నం కంటే ఎక్కువ తీసుకుంటే షుగర్​ లెవల్స్​ పెరిగే అవకాశం ఉంది. శరీరానికి తగిన వ్యాయామం కూడా అవసరం.   పాలిష్ చేసిన బియ్యం కంటే ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వాడటం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

లెమన్​ రైస్​ తిన్నా అందులో పెరుగు కలుపుకుంటే ఆ టేస్టే వేరు.. సమ్మర్​ సీజన్​ లో ఆరోగ్యంగా ఉండాలంటే కనీనం వారానికి నాలుగు సార్లు పెరుగన్నంలో సన్నగా ఉల్లిపాయను తరిగి.. అందులో మిక్స్​ చేసుకొని పొద్దున్నే తింటే  చలాకీగా ఎంత  పనైనా అలసట లేకుండా చేస్తారు. 

అన్నంలో తీపిలేని చిక్కటి పెరుగు..రుచి కోసం తురిమిన క్యారెట్, కీర దోసకాయ వంటి కూరగాయలను సన్నగా తరిగి మిక్స్​ చేసుకొని తినండి. ఫైబర్ కోసం ఉడికించిన బీన్స్ లేదా ఇతర  కూరగాయలు కలుపుకోవచ్చు. అయితే  అన్నం పరిమాణం తగ్గించి, పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.