అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ముందుకు సాగుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ బులియన్ మార్కెట్లలో కూడా రేట్లు తగ్గుతున్నాయి. ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైల్ కొనుగోలుదారులు తగ్గిన రేట్లను తమ నగరాల్లో తెలుసుకుని ముందుకెళ్లటం మంచిది.
జూన్ 17న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.27 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 110గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 850గా కొనసాగుతోంది.
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 17, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.275 దగ్గర ఉంది.
