పారిస్: భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బుధవారం (జూన్ 17) ప్రధాని మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు దేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
ఈ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమాసియాలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారత్-అమెరికా మధ్య చాలా విషయాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బేరసారాల్లో మోడీ నిక్కచ్చిగా ఉంటారని అన్నారు. అమెరికాలో భారత పెట్టుబడులకు మోడీ సహకరిస్తున్నారని.. ఆయన సహకారాన్ని అభినందిస్తున్నామన్నారు.
►ALSO READ | ప్రధాని మోడీ కూల్ అండ్ కామ్.. నేను ఆయనలా కాదు: ట్రంప్
మోడీ నాకు చిరకాల మిత్రుడని పేర్కొన్నారు. త్వరలో భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. భారత్‌పై దాడి జరిగితే మేం కాపాడుతాం.. మోడీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్‌ను కాపాడుతామని పేర్కొన్నారు. మోడీ తనకు గొప్ప స్నేహితుడని.. మా మధ్య ఎల్లప్పుడూ గొప్ప సంబంధం ఉందని అన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారత్‌కు వైట్‌హౌస్‌లో ఒక గొప్ప స్నేహితుడు ఉంటారని అన్నారు. ఇక్కడ ప్రతిఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తారని.. మోడీ వ్యక్తి పట్ల అమెరికన్లకు అపారమైన గౌరవం ఉందని అన్నారు.
