ప్రధాని మోడీ కూల్ అండ్ కామ్.. నేను ఆయనలా కాదు: ట్రంప్

ప్రధాని మోడీ కూల్ అండ్ కామ్.. నేను ఆయనలా కాదు: ట్రంప్

పారిస్: ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ వెరీ కూల్ అండ్ కామ్ అని.. తాను మాత్రం ఆయనలా కాదని అన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరిగిన ఓ లంచ్ మీటింగ్‎లో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘ప్రశాంతంగా, నిబ్బరంగా, పూర్తిస్థాయి యోధుడిగా ఉండే ప్రధాని మోదీలా నేను కాదు. ఆయన్ని చూడండి’’ అని ట్రంప్ అన్నారు. 

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ, ట్రంప్ బుధవారం (జూన్ 17) ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ కీలక సమావేశంలో ఇరు దేశాధినేతలు పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులు, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి, అమెరికా నుంచి ఇంధన దిగుమతులు, ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

►ALSO READ | డీల్ నాకు నచ్చకుంటే మళ్లీ రణరంగమే.. జీ7 సదస్సులో బిగ్ బాంబ్ పేల్చిన ట్రంప్