డీల్ నాకు నచ్చకుంటే మళ్లీ రణరంగమే.. జీ7 సదస్సులో బిగ్ బాంబ్ పేల్చిన ట్రంప్

డీల్ నాకు నచ్చకుంటే మళ్లీ రణరంగమే.. జీ7 సదస్సులో బిగ్ బాంబ్ పేల్చిన ట్రంప్

పారిస్: పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు అవగాహన ఒప్పందంపై 2026, జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా సంతకాలు చేయనున్నాయి. పీస్ డీల్‎పై సంతకాలు చేయడానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బిగ్ బాంబ్ పేల్చాడు. ఇరాన్‎తో కుదిరిన డీల్ ఫైనల్ కాదని.. అతి ఒక అవగాహన ఒప్పందం మాత్రమేనని అన్నారు.

ఒక వేళ ఆ డీల్ తనకు నచ్చకపోయినా, ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయిన ఆ దేశంపై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. 

‘‘ఈ డీల్ ఫైనల్ కాదు. ఇది ఒక అవగాహన ఒప్పందం మాత్రమే. ఒకవేళ ఆ డీల్ నాకు నచ్చకపోయినా.. ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయిన మేము మళ్లీ వాళ్లపై బాంబులు వేయడం ప్రారంభిస్తాము. ఎందుకంటే ఇరాన్ 47 ఏళ్లుగా తప్పుగా ప్రవర్తిస్తోంది’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ప్రపంచ ఇంధన కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి ఇప్పటికే పాక్షికంగా తెరిచారని.. రాబోయే ఒకటి రెండు రోజుల్లో దానిని పూర్తిగా తెరవబోతున్నారని ట్రంప్ పునరుద్ఘాటించారు.

►ALSO READ | ఇన్ స్టాలో మనం ఫేమస్ కపుల్: మోదీతో మెలోనీ.. మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ !

నెలల తరబడి సాగుతోన్న ఇరాన్, అమెరికా యుద్ధం ముగిసి.. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ దేశాలు హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇంతలోనే ట్రంప్ మళ్లీ బిగ్ బాంబ్ పేల్చాడు. ఆ ఒప్పందం ఫైనల్ కాదని.. డీల్ తనకు నచ్చకపోతే మళ్లీ యుద్ధమే అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ప్రపంచదేశాల్లో మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా యుద్ధంతో ఇంధనం, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అవుతున్నాయి. 

యుద్ధం ముగియడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఫైనల్ కాకుండా మళ్లీ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు అతలాకుతలం కావడం ఖాయం. ట్రంప్ పూటకో తీరు ప్రవర్తనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాలు ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. చంపేస్తే ఒకేసారి చంపేయండి.. అంతేకానీ ఈ పూటకో ట్విస్ట్‎తో మమల్ని ఇలా టెన్షన్ పెట్టకండి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.