ఇన్ స్టాలో మనం ఫేమస్ కపుల్: మోదీతో మెలోనీ.. మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ !

ఇన్ స్టాలో మనం ఫేమస్ కపుల్: మోదీతో మెలోనీ.. మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ !

మెలోడీ అనే పదం మరోసారి వైరల్ గా మారింది. గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) నేతల మీట్ లో భాగంగా.. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ  మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో మనం ఫేమస్ కపుల్.. అని మోదీతో మెలోనీ అనటం అక్కడున్న అందరి నేతల దృష్టినీ ఆకర్షించింది.  

  జీ7 సదస్సులో భాగంగా 2026 జూన్ 16న ఫ్రాన్స్‌ ఎవియాన్-లెస్-బైన్స్‌లో సమావేశమయ్యారు జీ7 నేతలు.  ఈ మీట్ లో ప్రపంచ సవాళ్లపై చర్చించడం, ఉక్రెయిన్‌కు తమ మద్దతు, అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన కీలక ఒప్పందాన్ని స్వాగతించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఇటాలియన్ పీఎం జార్జియా మెలోని మధ్య జరిగిన ఒక సంక్షిప్త సంభాషణ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో 'మెలోడీ' అనే పదం మళ్లీ తెరపైకి వచ్చింది.

సదస్సు సందర్భంగా జీ7 నేతలు గ్రూప్ ఫోటో కోసం నిలబడిన సందర్భంగా ఈ సంభాష జరిగింది.  యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఇతర నాయకులతో కలిసి గ్రూప్ ఫోటో కోసం వరుసలో నిలబడ్డారు మోదీ. అదే సమయంలో మోదీ, మెలోని ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని పలకరించుకున్న వీడియో వైరల్ గా మారింది.  

ఆడియో అంత  స్పష్టంగా లేనప్పటికీ, సోషల్ మీడియాలో మెలోడీకి ఉన్న క్రేజ్ గురించి మోదీ మెలోనిని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి రిప్లై గా..  అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫేమస్ కపుల్ అని నవ్వుతూ బదులిచ్చారు. 

ప్రధాని మోదీ తన రోమ్ పర్యటన సందర్భంగా, 'మెలోడీ' అనే పదం వైరల్ అయిన విషయం తెలిసిందే.  మెలోనికి పార్లే  కంపెనీ'మెలోడీ' టాఫీ ప్యాకెట్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వగా..  మోదీ ఇచ్చిన బహుమతికి ధన్యవాదాలు అని మోలోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మెలోని, ప్రధాని మోదీల పేర్ల కలయికతో ఏర్పడిన 'మెలోడీ' అనే పదం, 2023లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఒక ఇంటర్నెట్ జోక్‌గా మొదలైంది.ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆత్మీయ, సహజసిద్ధమైన క్షణాలకు సంబంధించి  అనేక వైరల్ క్లిప్‌లు, మీమ్స్‌ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 

మెలోని 2024లో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఒక సెల్ఫీతో పాటు, ఒక పోస్ట్‌లో మెలోడీ అనే  పదాన్ని తొలిసారి ఉపయోగించారు. హాయ్ ఫ్రెండ్స్, #ఫ్రమ్ మెలోడీ అని Xలో పోస్ట్ చేశారు. జూన్ 2025లో, G7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసి , హలో, మెలోడీ టీమ్ నుంచి అని క్యాప్షన్ పెట్టారు. అప్పటి నుంచి మెలోడీ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది.