సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్
దానికోసం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఏ ఏజ్ వాళ్లయినా ఎంజాయ్ చేస్తూ సైక్లింగ్ చేయొచ్చు. రోజూ కిరాణా షాప్ కు లేదా చిన్న చిన్న దూరాలకు వెళ్లేటప్పుడు హాయిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లొచ్చు. దాంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకి దాదాపు వందకోట్ల మంది సైక్లింగ్ చేస్తున్నారని ఒక అంచనా.
ఫిట్ నెస్ కోసం...
- కండరాలకు సైక్లింగ్ మంచి వర్కవుట్.
- మిగతా స్పోర్ట్స్ పోల్చితే సైక్లింగ్ చాలా ఈజీ. దీనికి ఫిజికల్ గా ఎక్కువ కష్టం ఉండదు.
- సైక్లింగ్ వల్ల బలంగా తయారవుతారు.
- స్టామినాతో పాటు ఫిట్ నెస్ వస్తుంది.
- ఫ్రెండ్ తో సరదాగా ఎక్కడికైనా సైకిల్ మీద వెళ్తే ఫన్ తో పాటు హెల్త్ కూ మంచిది.
- చిన్న చిన్న దూరాలకు బస్, బైక్ వంటివి వాడకుండా సైకిల్ మీద వెళ్లినా సరిపోతుంది. టైంపాస్ తోపాటు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.
ఆరోగ్యానికి...
- గుండె ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం చాలా మంచిది. సైక్లింగ్ కార్డియో వాస్కులార్ ఫిట్నెస్ ను పెంచుతుంది.
- యాంగ్జెటీ, డిప్రెషన్ తగ్గిపోతుంది.
- సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా కండరాలకు
- ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.
- కీళ్లు స్మూత్ గా కదలడానికి కూడా సైక్లింగ్ ఉపయోగపడుతుంది.
- సైక్లింగ్ చేస్తే స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. బాడీలో కొవ్వు కరుగుతుంది.
- కూర్చునే, నిలుచునే పద్ధతిలో మార్పు వస్తుంది.
- ఎముకలు బలంగా తయారవుతాయి.
- రోజూ సైక్లింగ్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
- సైక్లింగ్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్, క్యాన్సర్, డయాబెటిస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్ వంటి అనారోగ్యాల ముప్పు తప్పుతుంది.
హ్యాండ్ సైక్లింగ్
- హ్యాండ్ సైకిల్స్ రికంబెంట్ ట్రైసైకిల్స్ లానే ఉంటాయి. వీటితో కాళ్లకంటే చేతికే పనెక్కువ. అవసరమైనప్పుడు వెల్కోస్ట్రాప్స్ అనేవి చేతికి పెడల్స్ లాగా ఉపయోగపడతాయి.
- స్ప్రై నల్ ఇంజ్యూరీ అయినవాళ్లు కోలుకోవడానికి హ్యాండ్ సైక్లింగ్ పనికొస్తుంది.అంతేకాకుండా గుండె సంబంధిత, ఏరోబిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..
