మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు, వర్షానికి పక్కనే ఉన్న కారుపై ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మృతులను సంతోష్ రామ్, జగన్నాథ్ రెడ్డిగా గుర్తించారు. అకౌంటెంట్ జగన్నాథ్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కాగా.. డ్రైవర్ సంతోష్ రామ్ వెస్ట్ బెంగాల్ వాసి.
భారత్ మాల హైవే పనుల కోసం వీరిద్దరూ దేవరకద్రకు వచ్చారు. అక్కడే ఓ గది అద్దె తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 17) అద్దెకు ఉన్న గది దగ్గర కారులో వేచి ఉండగా భారీ వర్షం, ఈదురు గాలులకు పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో తిరుపతి, సంతోష్ రామ్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
