ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కల్వకుర్తి ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కల్వకుర్తి ఎమ్మెల్యే

ఆమనగల్లు, వెలుగు: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేర్చాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు.

శుక్రవారం నిర్వహించిన మాడ్గుల్ మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, మౌలిక వసతులపై అధికారులతో ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం జలసిరి కార్యక్రమంలో భాగంగా మ్యాజిక్ సోక్ పిట్, కమ్యూనిటీ సోక్ పిట్లకు ఆయన భూమి పూజ చేశారు.