వీడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్.. ఇన్ స్టాలో లవ్.. ఆ తర్వాత సహజీవనం.. ఇప్పుడు..!

వీడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్.. ఇన్ స్టాలో లవ్.. ఆ తర్వాత సహజీవనం.. ఇప్పుడు..!

పైన ఫొటో చూశారా.. బాగా చూడండీ.. వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు.. అది కూడా ఇన్ స్టాలో పుట్టిన ప్రేమ.. అతను ఏం చేస్తుంటాడో తెలుసా వాటర్ ట్యాంకర్ డ్రైవర్.. వీడి వయస్సు 27 ఏళ్లు.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా చేస్తూనే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్.. ఇన్ స్టా ఫాలోవర్.. ఇతని పేరు శరత్.. ఇన్ స్టాలో అనూష అనే 20 ఏళ్ల అమ్మాయి పరిచయం అయ్యింది. 

ఇన్ స్టాలో ఒకరి రీల్స్ ఒకరు చూసుకుంటూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ ఎంత దూరం వెళ్లింది అంటే.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహ జీవనం చేశారు. బెంగళూరు సిటీలో భార్యాభర్తలుగా చెప్పి ఓ అపార్ట్ మెంట్ ప్లాట్ లో ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటారా.. ఏమెందో ఏమో.. అనూష చనిపోయింది. ఎందుకు, ఎలా చనిపోయింది అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు సిటీలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్న శరత్ ది కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా సకలేష్ పూర్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అనూషతో ఇన్ స్టాలో పరిచయం అయ్యింది. ఆరు నెలలు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు విడిగా ఉండలేనంతగా వీరి ప్రేమ బంధం గట్టిగా మారింది. ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం బెంగళూరు సిటీలో సహజీవనం ప్రారంభించారు. భార్యాభర్తలుగా చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. 

ఆరు నెలలుగా హ్యాపీగా సాగుతుంది వీళ్ల వ్యవహారం. ఏమైందో ఏమో.. అనూషపై శరత్ కు అనుమానాలు పెరిగాయి.. అనూష తీరు నచ్చలేదు. గొడవలు మొదలయ్యాయి. 2026, జూన్ 20వ తేదీ అర్థరాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆవేశంలో అనూష గొంతు పిసికి చంపేశాడు శరత్. 

ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అనూషను చంపేసిన తర్వాత తనకు తెలిసిన లాయర్ ను కలిశాడు. హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. ఆ లాయర్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు శరత్ ను అదుపులోకి తీసుకున్నారు. శేషాద్రిపురంలో ఉన్న అనూష డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్యకు కారణం వ్యక్తిగత గొడవలు అని శరత్ చెబుతున్నా.. కచ్చితమైన కారణం ఏంటీ అనే అంశంపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏదిఏమైనా ప్రేమ ఎవరిపై.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు అనటానికి ఇదో ఎగ్జాంపుల్