13 గుండెలు.. 360 డిగ్రీ వ్యూ.. ఊపిరితిత్తులు లేకుండానే శ్వాస.. మెడ తెగినా రక్తం కారదు.. బొద్దింకల గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్స్

13 గుండెలు.. 360 డిగ్రీ వ్యూ.. ఊపిరితిత్తులు లేకుండానే శ్వాస.. మెడ తెగినా రక్తం కారదు.. బొద్దింకల గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్స్

ఈ భూమిపైన సంభవించిన నాలుగు విపత్తులను తట్టుకుని నిలబడిన జీవి ఏదైనా ఉందా అంటే అది కాక్రోచ్.. అంటే బొద్దింక ఒక్కటే అని చెప్పాలి. డైనోసర్స్ లాంటి జీవులే అంతరించినా.. భూమిపై జీవం తుడిచిపెట్టుకుపోయినా బతికిన బొద్దింకల గురించి ఎంత తరచి చూస్తే అన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి.  కాక్రోచ్ గురించి వింతలు, విశేషాలు, సుదీర్ఘ చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి. 

మన ఇళ్లలో బొద్దింకలు కనిపిస్తే  భయపడటం లేదా అసహ్యించుకోవడం జరుగుతుంది కదా. అయితే ప్రపంచవ్యాప్తంగా 4,500కు పైగా బొద్దింకల జాతులు ఉన్నప్పటికీ, కేవలం 30 జాతులు మాత్రమే మన ఇళ్లలో లేదా మనుషుల మధ్య నివసిస్తాయి.

  • కోట్లాది సంవత్సరాల చరిత్ర:

బొద్దింకలకు డైనోసార్ల కాలం కంటే ముందు నుంచే ఉన్న చరిత్ర ఉంది. 1889లో, శామ్యూల్ హబ్బర్డ్ స్కడ్డర్ అనే శాస్త్రవేత్త అమెరికాలోని బొగ్గు గనులలో సుమారు 350 మిలియన్ల (35 కోట్ల) సంవత్సరాల నాటి బొద్దింక రెక్కలను కనుగొన్నారు. ఆ కాలంలో, ఈ రెక్కలు 7 నుండి 9 సెంటీమీటర్ల పొడవు ఉండేవని ఆయన చెప్పారు. 

ఆ తరువాత, 2010లో ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 300 మిలియన్ల సంవత్సరాల నాటి శిలాజానికి సంబంధించిన ఒక 3D వర్చువల్ నమూనాను రూపొందించారు. దీని ద్వారా బొద్దింక శరీర నిర్మాణం అసలు స్వరూపం వెల్లడైంది. అంతేకాకుండా, 2012లో చైనాలో 310 మిలియన్ల సంవత్సరాల నాటి రెక్కల శిలాజాలు కనుగొన్నారు.  ఇవి ఆధునిక కాలపు బొద్దింకల రెక్కలను పోలి ఉన్నాయి.

  • నాలుగు విపత్తులను దాటి మనుగడలో..

బొద్దింక మామూలు జీవి కాదు. ఈ భూమిపై ఎన్నో జీవులు అవతరించాయి.. అంతరించాయి. కొన్ని జీవ జాతులు విపత్తుల కారణంగా పూర్తిగా అంతరించిపోయాయి. కానీ బొద్దింక బలం ఏంటంటే.. దాని మనుగడ సామర్థ్యం. భూమిని తాకిన నాలుగు అతిపెద్ద విపత్తులను ఇది ధైర్యంగా తట్టుకుని నిలబడింది. 

లేట్ డెవోనియన్ ఘటన: ఇది 37.2 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. సముద్రాలలో ఆక్సిజన్ అయిపోయి 75% జీవజాతులు అంతరించిపోయినప్పటికీ బొద్దిపరుగులు బ్రతికి బయటపడ్డాయి.

ALSO READ : సీజన్ కు తగ్గట్టు మేకప్ మార్చాలి..

పెర్మయన్-ట్రియాసిక్ ఘటన: ఇది 25.2 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. సైబీరియాలో అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన ఆమ్ల వర్షాలు 96 శాతం సముద్ర జీవజాలాన్ని, 70 శాతం భూమిపై ఉన్న జంతుజాలాన్ని  నాశనం చేశాయి. బొద్దింకలు మాత్రం  చిత్తడి నేలల కింద దాక్కుని, కుళ్ళిపోయిన ఆహారాన్ని తిని బ్రతికాయి.

ట్రియాసిక్-జురాసిక్ ఘటన: ఇది20.1 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. గ్రేట్ లీప్ ఆఫ్ ఫైర్ విస్ఫోటనం చెంది, 80 శాతం జీవజాతులను నాశనం చేసింది. అయినప్పటికీ, బొద్దిపురుగులు బ్రతికి బయటపడ్డాయి.

డైనోసర్ల అంతం : 6.6 బిలియన్ సంవత్సరాల క్రితం మాట ఇది. భూమిపై 10 కిలోమీటర్ల వెడల్పు గల అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది డైనోసర్లను తుడిచిపెట్టినప్పుడు, ఈ జీవి మాత్రం బ్రతికి బయటపడగలిగింది.

  • 13-భాగాల గుండె , 360-డిగ్రీల దృష్టి:

బొద్దింక శరీర నిర్మాణం ఇతర జీవుల కన్నా విలక్షణంగా ఉంటుంది. దాని శరీరం తల, కడుపు, తోక అనే మూడు ప్రధాన భాగాలుగా ఉంటుంది.

తల: దీనికి 360 డిగ్రీలు చూడగలిగే రెండు కళ్ళు, సెన్సార్‌లుగా పనిచేసే రెండు యాంటెనాలు, తినడానికి, తాగడానికి ఒక నోరు ఉంటాయి.

మొండెం , తోక: ఈ భాగంలో ఆరు కాళ్ళు, నాలుగు రెక్కలు, 13 గదులుగా గుండె ఉంటుంది.

ఆశ్చర్యకరంగా, వీటికి ఊపిరితిత్తులు ఉండవు. కానీ అవి శ్వాసను తీసుకుంటాయి. తమ శరీరానికి ఇరువైపులా ఉండే చిన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. బొద్దింకల్లో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల వాటి రక్తం తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.

  • తల తెగినా బ్రతికి ఉండే జీవి:

వాస్తవానికి, బొద్దింక మెదడు కేవలం తలలోనే కాకుండా, దాని శరీరం అంతటా తొమ్మిది వేర్వేరు భాగాలుగా విస్తరించి ఉంటుంది. ఒక భాగం దెబ్బతిన్నా, మిగిలిన భాగాలు తమ పనిని కొనసాగిస్తాయి. తల తెగిపోయినప్పుడు, దాని మెడ భాగం వెంటనే మూసుకుపోవడం వల్ల రక్తం బయటకు పోకుండా ఆగిపోతుంది. అయితే, నోరు లేకపోవడం వల్ల అది నీరు తాగలేదు, దాంతో కొన్ని వారాల తర్వాత దాహంతో చనిపోతుంది.

  • మగ జీవి లేకున్నా సంతానం:

బొద్దిపురుగులు ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలవు. పువ్వులు, ఆకులు, మాంసం వంటివి తిని బ్రతకగలవు. వీటన్నింటికంటే అద్భుతమైన విషయం..వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరింత ఆశ్చర్యకరమైనది కావడం. 
సాధారణంగా, ఒక ఆడ బొద్దింక మగదానితో జతకట్టిన తర్వాత ప్రతి నెలా ఊథెకాను ఉత్పత్తి చేస్తుంది. ఇది 16 నుంచి 40 గుడ్లను కలిగి ఉండే ఒక ఆకుపచ్చ గుళిక. ఈ గుళిక ఎంత బలంగా ఉంటుందంటే, ఏ కీటకం కూడా దానిని పగలగొట్టలేదు. ఒక ఆడ బొద్దిపురుగు మగదాని వీర్యాన్ని తన శరీరంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆడబొద్దింకలు మగది లేకుండా కూడా సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. ఈ ప్రక్రియను పార్థెనోజెనిసిస్ అంటారు. ఏదైనా ప్రమాదంలో వాటి శరీర భాగాలు ముక్కలుముక్కలైనా..  వాటి గుడ్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటాయి.

ఒకవేళ ప్రపంచ యుద్ధం సంభవిస్తే, కేవలం బొద్దింకలు మాత్రమే మనుగడ సాగిస్తాయని అంటున్నారు శాస్ర్తవేత్తలు. ఇది కేవలం నోటి మాట కాదు. 1945లో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణు బాంబు దాడుల్లో 2 లక్షల 50 వేల  మందికి పైగా మరణించారు. కానీ బొద్దింకలు మాత్రం మురుగు కాలువల నుండి హాయిగా బయటకు వస్తూ కనిపించాయి. శాస్త్రవేత్తల ప్రకారం, మనిషి 400 రాడ్ల (rad) రేడియేషన్‌కు గురైతే చనిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, జర్మన్ బొద్దింక మాత్రం 9,500 రాడ్ల రేడియేషన్‌ను సులభంగా తట్టుకోగలదు.

వాస్తవానికి, బొద్దింక శరీరం పై పొర చాలా దృఢంగా ఉండి, తన సొంత బరువుకు 900 రెట్ల బరువును మోయగలదు. అయితే, మనం చెప్పుతో లేదా ఏదైనా వస్తువుతో బలంగా  కొట్టినప్పుడు ఆ పొర పగిలిపోయి, లోపల ఉండే సున్నితమైన అవయవాలన్నీ దెబ్బతింటాయి. అయినప్పటికీ,  అంతటి తీవ్రమైన దాడిలో కూడా వాటి గుడ్లు మాత్రం పగిలిపోవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ విలక్షణమైన జీవిపై అనేక ప్రయోగాలు చేస్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఏ ముహూర్తాన ఆవిర్భవించిందో కానీ..  కాక్రోచ్లు.. అంటే బొద్దింకల అసలు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం కలిగిందనే చెప్పవచ్చు.