హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (మే 3) సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ తొలుత బౌలింగ్ చేయనుంది. సన్ రైజర్స్ స్టార్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
అతని స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ జట్టులోకి వచ్చాడు. లీగ్ లో వరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ కేకేఆర్ ను చిత్తు చేసి ఫ్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైఫు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ
